Vijayasai Reddy: రాజ్యసభలో విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి

Vijayasai Reddy gets new post in Rajya Sabha
  • రాజ్యసభలో వైసీపీకి పెరిగిన బలం
  • బీఏసీలో వైసీపీకి చోటు
  • బీఏసీ సభ్యుడిగా విజయసాయికి అవకాశం
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి మరో పదవి దక్కింది. ఇటీవలే రాజ్యసభలో వైసీపీ బలం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. ఈ నేపథ్యంలో కీలకమైన రాజ్యసభ బీఏసీలో వైసీపీకి చోటు దక్కింది. దీంతో, బీఏసీలో సభ్యుడిగా విజయసాయికి స్థానం లభించింది. సబార్డినేట్ లెజిస్టేచర్ కమిటీ సభ్యులుగా బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, టీఆర్ఎస్ సభ్యుడు సురేశ్ రెడ్డి నియమితులయ్యారు.

ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ బలం రెండు నుంచి ఆరుకు పెరిగింది. పార్టీ రాజ్యసభ సభ్యులుగా విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నత్వానీలు ఉన్నారు.
Vijayasai Reddy
YSRCP
Rajya Sabha
BAC

More Telugu News