Deccan Hospital: సోమాజిగూడ దక్కన్ ఆసుపత్రిపై వేటు వేసిన తెలంగాణ సర్కారు
- సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
- దక్కన్ ఆసుపత్రిలో కరోనా వైద్యం రద్దు
- దక్కన్ ఆసుపత్రిపై ఫిర్యాదుల వెల్లువ
కరోనా చికిత్సల అంశంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న తెలంగాణ సర్కారు చెప్పినట్టే చేసింది. తొలిసారిగా ఓ కార్పొరేట్ ఆసుపత్రిపై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమాజిగూడ దక్కన్ ఆసుపత్రిలో కరోనా వైద్యం చేయడాన్ని రద్దు చేసింది.
కరోనా వైద్యానికి సంబంధించి ఇటీవల దక్కన్ ఆసుపత్రిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సత్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యులు దక్కన్ ఆసుపత్రిపై మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ లకు ఫిర్యాదు చేశారు. రూ.10 లక్షలు కట్టినా మృతదేహం అప్పగించేందుకు మరో రూ.2 లక్షలు అడిగారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దక్కన్ ఆసుపత్రిని కరోనా ఆసుపత్రుల జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.