Amit Shah: అమిత్ షాను కలిశాను.. క్వారంటైన్‌లోకి వెళ్తున్నా: కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో

Going Into Self Isolation says Babul Supriyo

  • కుటుంబ సభ్యులకు దూరంగా సెల్ప్ ఐసోలేషన్‌లోకి..
  • నిబంధనల ప్రకారం అన్ని ముందుజాగ్రత్త చర్యలు
  • తనను కలిసిన వారు ఐసోలేషన్‌లోకి వెళ్లాలన్న అమిత్ షా

కరోనా బారినపడిన కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసిన మరో మంత్రి బాబుల్ సుప్రియో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తాను అమిత్ షాను కలిశానని, వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులకు దూరంగా గృహ నిర్బంధంలో ఉండనున్నట్టు తెలిపారు. పరీక్షలు చేయించుకుని రిజల్ట్ వచ్చేంత వరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉంటానని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

కాగా, తనకు కరోనా సోకినట్టు అమిత్ షా నిన్న ట్వీట్ చేశారు. తనలో లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకున్నానని, పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, అయితే, వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు ఐసోలేషన్‌లో ఉండాలని అమిత్ షా సూచించారు.

Amit Shah
Babul Supriyo
Corona Virus
self isolation
  • Loading...

More Telugu News