Ram Gopal Varma: డబ్బు కోసం సినిమాలు తీస్తోంది నేనొక్కడ్నేనా... ఇతర ఫిలింమేకర్లు డబ్బు కోసం సినిమాలు తీయడంలేదా?: వర్మ

Director Ram Gopal Varma gives reply to critics
  • ఇటీవల వరుసగా సినిమాలు తీస్తున్న వర్మ
  • వివాదాస్పద కథాంశాల కారణంగా వర్మపై విమర్శలు
  • ట్విట్టర్ లో బదులిచ్చిన వర్మ
ఇటీవల కాలంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ కొత్త చిత్రం ప్రకటించినా ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ అవుతోంది. వివాదం కారణంగా వర్మ చిత్రాలకు పబ్లిసిటీ వస్తుందని, డబ్బు కోసమే వర్మ వివాదాస్పద కథాంశాలను ఎన్నుకుంటాడని ప్రచారం జరుగుతోంది.

దీనిపై వర్మ ట్విట్టర్ లో స్పందించారు. "డబ్బు కోసమే ఈ సినిమాలు తీస్తున్నాడు అని చెబుతున్నవారందరికీ ఓ మనవి. డబ్బు కోసం సినిమాలు తీస్తోంది నేనొక్కడ్నేనా... ఇతర ఫిలింమేకర్లు అందరూ డబ్బు కోసం సినిమాలు తీయడంలేదా? వాళ్లందరూ మనుషులపై ప్రేమతో, మానవతా గుణంతో, సేవభావంతోనో, లేకపోతే పేదలకు విరాళాలు ఇచ్చేందుకు సినిమాలు తీస్తున్నారా?" అంటూ ప్రశ్నించారు.
Ram Gopal Varma
Movies
Money
Film Makers

More Telugu News