Rafale: రాఫెల్ విమానాలు భారత్ కు అవసరమా?: అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్
- అవసరాలకు మించి సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటోంది
- దక్షిణాసియాలో ఇది ఆయుధ పోటీకి దారితీస్తుంది
- భారత్ ను నిలువరించాలి
రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరడంతో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. తొలి విడతలో ఐదు విమానాలు భారత్ కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కింది. భారత్ కు రాఫెల్ విమానాలు అవసరమా? అని ప్రశ్నించింది. దేశ భద్రతకు కావాల్సిన అవసరాలకు మించి సైనిక సామర్థ్యాలను కూడగట్టుకుంటోందని విమర్శించింది. భారత్ చేపడుతున్న అసమానమైన ఆయుధాల సేకరణ దక్షిణాసియాలో ఆయుధ పోటీకి దారితీస్తుందని... భారత్ ను నిలువరించాలని ప్రపంచ దేశాలను కోరింది. పాక్ విదేశాంగ శాఖ ఈ మేరకు వ్యాఖ్యానించింది.