Pooja Hegde: పూజ హెగ్డేకు డిమాండ్.. పెరిగిన పారితోషికం!

Pooja Hegde hikes her fee

  • పూజ హెగ్డేకు బాలీవుడ్ లో కూడా డిమాండ్ 
  • 'అల వైకుంఠపురములో' చిత్రానికి 1.4 కోట్లు
  • ఇప్పుడు రెండు కోట్లకు పెంచిన ముద్దుగుమ్మ

వరుసగా హిట్టు మీద హిట్టు పడిన హీరోయిన్ కి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయి. అలాంటి అవకాశాలు వస్తే కనుక ఆటోమేటిక్ గా ఆ కథానాయికకి డిమాండ్ పెరిగిపోతుంది. దాంతో పారితోషికం కూడా పెంచేస్తారు. ఆ పెంపుకు సక్సెస్.. డిమాండ్ అన్నవే కొలమానం!

ఇప్పుడు కథానాయిక పూజ హెగ్డే కూడా అలాంటి డిమాండులోనే ఉండడంతో అమ్మడి రెమ్యూనరేషన్ బాగా పెరిగిపోయింది. భారీ చిత్రాల నిర్మాతలు మాత్రమే ఆమె పారితోషికాన్ని భరించే స్థితిలో వున్నారు. పైగా, పూజాకు తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ ఉండడంతో ఆమె డేట్స్ దొరకడమే కష్టంగా వుందట.  

ఆమధ్య వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రానికి ముందు పూజ కోటి రూపాయల వరకు తీసుకునేది. ఆ సినిమాకు 1.4 కోట్ల వరకు తీసుకుందని వినికిడి. ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తన పారితోషికాన్ని ఒక్కసారిగా రెండు కోట్లకు పెంచేసిందట. అయినప్పటికీ, ఆమెకున్న క్రేజ్ ను బట్టి పూజను బుక్ చేయడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు మరి!  

Pooja Hegde
Ala Vaikuntha puramulo
Remuneration
Bollywood
  • Loading...

More Telugu News