Rafele: రాఫెల్ ఫైటర్ జెట్ తొలి భారత పైలట్ గా చరిత్ర సృష్టించిన హిలాల్!
- తొలి బ్యాచ్ లో ఓ విమానాన్ని నడిపిన హిలాల్
- ప్రపంచ ఉత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్ గా ఘనత
- కశ్మీర్ కు చెందిన ఎయిర్ కమాండర్ గా హిలాల్
ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన రాఫెల్ ఫైటర్ జెట్ ను నడిపిన తొలి భారత పైలట్ గా ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ చరిత్ర సృష్టించారు. తొలి బ్యాచ్ లో భాగంగా డెలివరీ అయిన ఐదు విమానాల్లో ఒకదాన్ని కశ్మీర్ కు చెందిన హిలాల్ నడిపారు.
వైమానిక దళంలో కమాండర్ గా ఉన్న హిలాల్, మిరేజ్ 2000, మిగ్ 21 తదితర ఫైటర్ జెట్ లపై 3 వేలకు పైగా ఫ్లయింగ్ అవర్స్ ను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రపంచంలోని ఉత్తమ ఫ్లయింగ్ అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన తండ్రి మొహమ్మద్ రాథోడ్ డీఎస్పీగా పనిచేశారు. ఇండియా అవసరాలకు అనుగుణంగా రాఫెల్ యుద్ధ విమానాలను మార్చే విషయంలోనూ ఆయన తనవంతు సహకారాన్ని అందించారు.