ED: జీవీకే గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు
- ముంబయి ఎయిర్ పోర్టు స్కాంలో ఈడీ చర్యలు
- జీవీకే ప్రమోటర్లపై ఇప్పటికే ఈడీ కేసు
- రూ.705 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు
ముంబయి ఎయిర్ పోర్టులో రూ.705 కోట్ల మేర ఆర్థిక అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జీవీకే గ్రూప్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో జీవీకే గ్రూప్ అధినేత జీవీకే రెడ్డి, ఆయన తనయుడు జీవీ సంజయ్ రెడ్డికి చెందిన పలు కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం అనుసరించి ఈ తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్టు కుంభకోణానికి సంబంధించి జీవీకే ప్రమోటర్లపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదైంది. అంతకుముందు, ఈ వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయగా, ఆపై ఈడీ రంగప్రవేశం చేసింది.