Kick Shaam: నటుడు కిక్ శ్యామ్ ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

Police arrests Kick Shaam

  • అనుమతి లేకుండా గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు
  • శ్యామ్ సహా 14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్

తెలుగులో కిక్, రేసుగుర్రం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్ ను గ్యాంబ్లింగ్ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా జూదం, బెట్టింగులు నిర్వహిస్తున్నాడంటూ చెన్నై, కోడంబాక్కం పోలీసులు సోమవారం రాత్రి శ్యామ్ తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.

కిక్ సినిమానే ఇంటిపేరుగా మార్చుకుని కిక్ శ్యామ్ గా ఫేమస్ అయిన ఈ నటుడికి చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో ఓ పోకర్ క్లబ్ ఉంది. అనుమతి లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. క్లబ్ ముసుగులో గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా, నుంగంబాక్కంలో నివసించే శ్యామ్, కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తన నివాసంలోనూ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

Kick Shaam
Arrest
Police
Poker
Gambling
Chennai
  • Loading...

More Telugu News