Corona Virus: కరోనా వైరస్‌ను సమర్థంగా అడ్డుకునే మరో 21 రకాల ఔషధాల గుర్తింపు

another 21 drugs found to fight against covid

  • అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ బర్న్‌హామ్ ప్రిబైస్ మెడికల్ డిస్కవరీ ఇనిస్టిట్యూట్ అధ్యయనం
  • 12 వేల ఔషధాలపై పరిశోధన
  • రెమ్‌డెసివిర్‌తో కలిపి వాడేందుకు 21 ఔషధాల గుర్తింపు

కొవిడ్ మహమ్మారిని అంతమొందించే టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెమ్‌డెసివిర్, క్లోరోక్విన్ వంటి ఔషధాలను అత్యవసర చికిత్సలో వాడుతున్నారు. అయితే, ఇవి మాత్రమే కాకుండా మరో 21 ఔషధాలు కూడా కరోనాను సమర్థంగా ఎదుర్కోగలవని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ బర్న్‌హామ్ ప్రిబైస్ మెడికల్ డిస్కవరీ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న 12 వేల ఔషధాలను వీరు పరిశీలించగా, వాటిలో 21 కరోనాకు అడ్డుకట్ట వేయగలవని గుర్తించారు.

అంతేకాదు, వీటిలో నాలుగు ఔషధాలను ప్రస్తుతం కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్‌లో కలిపి వాడొచ్చని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. రెమ్‌డెసివిర్ ఔషధం అందరిపైనా పనిచేయదని, బాధితుడు కోలుకునే సమయాన్ని మాత్రం ఇది తగ్గించిందని అధ్యయనంలో పాల్గొన్న భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త సుమిత్ చంద్ర పేర్కొన్నారు. కాబట్టి రెమ్‌డెసివిర్‌తో కలిసి ఉపయోగించగలిగే ఔషధాల కోసం అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా 21 ఔషధాలను గుర్తించినట్టు వివరించారు. 

  • Loading...

More Telugu News