Green Card: ఇప్పటి పరిస్థితుల్లో భారతీయులకు గ్రీన్ కార్డు రావాలంటే 195 ఏళ్లు వేచి చూడాల్సిందే: అమెరికా సెనేటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

US senator comments on Green Card for Indians

  • వలసదారులకు ఆమెరికాలో శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డు
  • ట్రంప్ వచ్చాక మారిన పరిస్థితులు
  • పరిష్కారం కోసం సెనేటర్లు కలిసి రావాలన్న మైక్ లీ

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక ఇమ్మిగ్రేషన్ రంగం భారీ కుదుపులకు గురైంది. ఇతర దేశాల నుంచి అమెరికా రావాలనుకునేవారికి, అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునేవారికి అడుగడుగునా కఠిన అవరోధాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సెనేటర్ మైక్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయులకు గ్రీన్ కార్డు రావాలంటే 195 ఏళ్లకు పైగా వేచి చూడాల్సి ఉంటుందని అన్నారు. భారత్ నుంచి వచ్చేవాళ్లు ఎవరైనా గ్రీన్ కార్డు కోరుతూ బ్యాక్ లాగ్ వెయిటింగ్ లిస్టులో చేరితే వారు ఆశలు వదులుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్టులో ఉన్నవారి కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తుండడంతో వారు తమ వలస హోదాను కూడా కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని మరో సెనేటర్ డిక్ డర్బిన్ అభిప్రాయపడ్డారు. డర్బిన్ వ్యాఖ్యలపై మైక్ లీ స్పందిస్తూ, ఈ సమస్యకు చట్టబద్ధమైన రీతిలో పరిష్కారం కనుగొనేందుకు కలిసి రావాలని ఇతర సెనేటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రీన్ కార్డు దరఖాస్తుదారుడు మరణించిన సందర్భాల్లో వారి సంతానానికి ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం ఏ విధంగానూ ఉపయోగపడడంలేదని అన్నారు.

Green Card
Indians
USA
Mike Lee
Donald Trump
  • Loading...

More Telugu News