Alaska: అలాస్కా భూకంపం పెద్దదే... భీతి గొలుపుతున్న చిత్రాలు!

Alaska Earth Quake Pics

  • సముద్రంలో 17 మైళ్ల లోతున కేంద్రం
  • దెబ్బతిన్న జాతీయ రహదారులు
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న చిత్రాలు

రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో అలాస్కా దక్షిణ తీరంలో సంభవించిన భూకంపం పెను ప్రభావాన్నే చూపించింది. దేశవ్యాప్తంగా ఎన్నో జాతీయ రహదారులు, వేల కొద్దీ భవనాలు  దెబ్బతిన్నాయి. తీరం నుంచి ఆగ్నేయ దిశగా, సముద్రంలో 105 కిలోమీటర్ల దూరంలో 17 మైళ్ల లోతున ప్రకంపనలు రాగా, సునామీ హెచ్చరికలను సైతం జారీ చేయడం జరిగింది.

అయితే, ప్రకంపనల తీవ్రత చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ, ప్రజలలో చాలామందికి దీని తీవ్రత పెద్దగా తెలియలేదని భూకంప పరిశోధకుడు మైకేల్ వెస్ట్ వెల్లడించారు. అలాస్కాకు 160 కిలోమీటర్ల పరిధిలో వున్న వారికి ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయని, ఆపై 805 కిలోమీటర్ల వరకూ ఉన్న వారు భూకంపం వచ్చినట్టు గ్రహించారని వెల్లడించారు.

అలాస్కా కాలమానం ప్రకారం, మంగళవారం రాత్రి భూకంపం సంభవించగా, ఇప్పుడు సోషల్ మీడియా భూకంపానికి సంబంధించిన చిత్రాలతో నిండిపోతోంది. ప్రాణ నష్టం జరుగకపోయినా, ఆస్తి నష్టం మాత్రం చాలా అధికంగానే ఉన్నట్టు తెలుస్తోంది. భూకంపం తరువాత సునామీ హెచ్చరికలు రాగానే, ప్రజలంతా కొండ ప్రాంతాలపైకి పరుగులు పెట్టారు. ఆపై తాము ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేశారు.

Alaska
Earth Quake
Social Media
  • Loading...

More Telugu News