Jagan: టీడీపీ నేతలు కుట్రపూరితంగా కేసులు వేస్తున్నారు: 'పచ్చతోరణం' కార్యక్రమంలో జగన్ విమర్శలు

jagan inaugurates pachathoranam

  • రాష్ట్ర పౌరులంతా మొక్కలు నాటాలి
  • వచ్చేనెల 15న 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిస్తాం
  • ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపాడులో పేదల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్‌లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొక్కలు నాటి 'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కొడాలి నాని , పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.  

వన మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 20 కోట్ల మొక్కల్ని నాటనున్నట్లు జగన్ తెలిపారు. ఏపీలోని 13,000 పంచాయతీల్లో తాము ఇప్పటికే 17,000 లే అవుట్లు సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్ర పౌరులంతా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కాగా, వచ్చేనెల 15న 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ఆయన ప్రకటించారు. తాము ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ, కేసులు వేస్తున్నారని తెలిపారు.

 కాగా, ఏపీలో ఒక్కొక్కరు పది మొక్కలు నాటడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు. 

  • Loading...

More Telugu News