Guntur: పాత గుంటూరు ఎస్సైపై స్థానికుల దాడి.. తీవ్ర గాయాలు!

Locals attacked Old Guntur SI

  • పొన్నూరు రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్సై
  • వాగ్వాదానికి దిగిన స్థానికులు
  • గాయపడిన ఎస్సై జీజీహెచ్ కి తరలింపు

పాత గుంటూరు ఎస్సైపై స్థానికులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఎస్సై అమీర్ తన బృందంతో కలిసి పొన్నూరు రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి అది ముదిరింది. అనంతరం అమీర్ పై వారు భౌతికదాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, ఆయనను ఘటనాస్థలి నుంచి జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న డీఎస్పీ సీతారామయ్య ఘటనాస్థలికి వచ్చారు. స్థానికులను, ఇతర సిబ్బందిని అడిగి గొడవ గురించి ఆరా తీశారు.

  • Loading...

More Telugu News