Asteroid 2020 ND: భూమి దిశగా 'ఎన్డీ' గ్రహశకలం శరవేగంతో దూసుకువస్తోంది: నాసా హెచ్చరిక
- జూలై 24 నాటికి భూమికి సమీపంగా గ్రహశకలం
- ఇది భారీ సైజులో ఉందన్న నాసా
- మరో రెండు గ్రహశకలాలు కూడా వస్తున్నాయని వెల్లడి
గ్రహశకలాల ప్రమాదం భూమికి ఈనాటిది కాదు. ఇటీవల కాలంలో అనేకసార్లు గ్రహశకలాలు భయపెట్టినా, భూమండలానికి పెద్దగా ప్రమాదం జరగలేదు. అయితే, ఇప్పుడు 'ఆస్టరాయిడ్ 2020 ఎన్డీ' అనే గ్రహశకలం భూమి దిశగా అమితవేగంతో దూసుకువస్తోందని, ఇతర గ్రహశకలాల్లా దీన్ని తేలిగ్గా తీసుకోలేమని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' హెచ్చరించింది.
ఇది సైజు పరంగానే కాకుండా, వేగం రీత్యా కూడా ప్రమాదకరం అని పేర్కొంది. ఇది భూమి దిశగా కదులుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని 'నాసా' తెలిపింది. ఇది జూలై 24 నాటికి భూమికి సమీపంగా వస్తుందని వెల్లడించింది. ఇదే కాకుండా, '2016 డీవై 30', '2020 ఎంఈ3' అనే మరో రెండు గ్రహశకలాలు కూడా భూమికి దగ్గరగా వస్తున్నాయని వివరించింది.