Hyderabad: తెలంగాణలో ఆగని కరోనా ఉద్ధృతి... జిల్లాల్లోనూ అదే తీరు

Corona cases in Telangana reached 43780

  • నిన్న రాష్ట్రవ్యాప్తంగా 1,284 కేసుల నమోదు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 667 కేసులు
  • ఒకశాతం కంటే తక్కువగా మరణాల రేటు

తెలంగాణలో నిన్న కూడా వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 1,284 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 43,780కి పెరిగింది. అలాగే, ఇప్పటి వరకు 409 మంది మరణించారు. రాష్ట్రంలో ఇంకా 12,765 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అంటే 29 శాతం. అలాగే 409 మరణాలతో ఒక శాతం కంటే తక్కువగా 0.93 శాతంగా మరణాల రేటు నమోదైంది. అలాగే, నిన్న ఒక్క రోజే 1,902 మంది కోలుకున్నారు.

ఇక ఎప్పటిలానే జీహెచ్ఎంసీ పరిధిలో 667 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత సంగారెడ్డి (86), రంగారెడ్డి (68), మేడ్చల్ (62), కరీంనగర్ (58), నల్గొండ (46), వరంగల్ అర్బన్ (37), వికారాబాద్ (35)లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్, వనపర్తి, సిద్దిపేట, సూర్యాపేటలలో 20కి పైగా కేసులు నమోదయ్యాయి.

ఇక నిన్న ఒక్క రోజే 14,883 శాంపిళ్లు పరీక్షించారు. దీంతో ఇప్పటి వరకు పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 2,52,700కు పెరిగింది. రాష్ట్రంలో 11,928 ఐసోలేషన్ బెడ్లు అందుబాటులో ఉండగా, వీటిలో 1,003 బెడ్లు నిండుకున్నాయి. ఇంకా 10,925 ఖాళీగా ఉన్నాయి. అలాగే, 3,537 ఆక్సిజన్ బెడ్లకు గాను 2,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 1,616 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉండగా, 1,318 పడకలు ఇంకా అందుబాటులో ఉన్నట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.


.

  • Loading...

More Telugu News