Monash: 20 నిమిషాల్లో కరోనా టెస్టు... ఆస్ట్రేలియా పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ

Monash University researchers develops new corona testing method

  • యాంటీబాడీలు గుర్తించే టెస్టింగ్ విధానం
  • రక్త పరీక్షతో వైరస్ గుట్టురట్టు
  • రూపొందించిన మోనాష్ వర్సిటీ

కొన్ని చోట్ల కరోనా టెస్టుల ఫలితాలు రావాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఆస్ట్రేలియా పరిశోధకులు కేవలం 20 నిమిషాల్లో కరోనా టెస్టు ఫలితాన్ని ఇచ్చే సరికొత్త కిట్ ఆవిష్కరించారు. మెల్బోర్న్ లోని మోనాష్ యూనివర్సిటీ నూతన టెస్టింగ్ విధానాన్ని రూపొందించారు. ఇది ఓ రక్తపరీక్ష వంటిదే. కరోనా వైరస్ సోకినప్పుడు శరీరం సహజసిద్ధంగా తయారుచేసుకునే యాంటీబాడీల ఉనికిని గుర్తించడమే ఈ పరీక్ష విధానంలో ముఖ్యసూత్రం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా పరీక్షలు పీసీఆర్, ఆర్టీపీసీఆర్ విధానంలో చేస్తున్నారు. అందుకు అత్యధిక సమయం పడుతుండడంతో మోనాష్ వర్సిటీ రూపొందించిన టెస్టింగ్ విధానం ఆశలు రేపుతోంది.

  • Loading...

More Telugu News