: రోడ్డు పక్కనే ఇల్లుంటే కష్టమే...!


రోడ్డు పక్కనే ఇల్లుంటే బాగుంటుందని చాలమంది అనుకుంటుంటారు. చక్కగా ఇలా ఇల్లు దిగగానే రోడ్డులోకి వెళ్లి తమకు కావలసిన పనులను చక్కబెట్టుకోవచ్చని అనుకుంటారు. అయితే రోడ్డు పక్కనే నివాసం ఉంటే రోడ్డుపై వచ్చే, పోయే వాహనాల శబ్దాలు, అవి వదిలే పొగ వల్ల మన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజూ శబ్ద, వాయు కాలుష్యాల వల్ల గుండెజబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీరు చెబుతున్నారు.

జర్మనీలో ఈ విషయంపై భారీ అధ్యయనం జరిగింది. మూడు నగరాల్లోని ప్రజలు రోజూ ఎంత సమయం మేర శబ్ద, వాయు కాలుష్యాల మధ్య జీవిస్తున్నారో శాస్త్రీయ పరంగా విశ్లేషించారు. ఈ విశ్లేషణలో సాధారణ స్థాయిని మించిన శబ్ద, వాయు కాలుష్యాల మధ్య నివసిస్తున్న వారిలో 60 ఏళ్ల సగటు వయసు వారికి గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు నిర్ధారించారు. కాబట్టి ఎక్కువగా శబ్ద, వాయు కాలుష్యాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివాసం అంత మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News