Vijay: ఆ సినిమా విషయంలో విజయ్ అభిమానులు ఆందోళన చెందొద్దు: సన్ పిక్చర్స్

Sun Pictures appeals Vijay fans not  to  worry
  • విజయ్, మురుగదాస్, సన్ పిక్చర్స్ కాంబినేషన్లో కొత్త సినిమా
  • స్క్రిప్ట్ విషయంలో విభేదాలతో ఆగిపోయిందంటూ ప్రచారం
  • ఇవన్నీ పుకార్లేనని ప్రకటించిన సన్ పిక్చర్స్
తమిళనాడులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఇద్దరు ముగ్గురు హీరోల్లో విజయ్ ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక దర్శకుడు మురుగదాస్ కు ఉన్న హిట్ ట్రాక్ రికార్డ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే... అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ నేపథ్యంలో, ఓ ఆసక్తికర వార్త తమిళనాట వైరల్ అవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే స్క్రిప్ట్ విషయంలో వచ్చిన విభేదాలతో సినిమా క్యాన్సిల్ అయిందనే వార్త విజయ్ అభిమానులను పూర్తిగా నిరాశ పడేలా చేసింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఈ వార్తలపై సన్ పిక్చర్స్ స్పందించింది.

సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని సన్ పిక్చర్స్ తెలిపింది. మురుగదాస్ తమకు ఎంతో ఆత్మీయుడని, ఆయనతో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పింది. స్క్రిప్ట్ విషయంలో ఆయన చాలా పక్కాగా ఉంటారని తెలిపింది. ఇలాంటి పుకార్లను విజయ్ అభిమానులు నమ్మవద్దని కోరింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. సన్ పిక్చర్స్ ప్రకటనతో విజయ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Vijay
Mugugadoss
Sun Pictures
Kollywood

More Telugu News