Jaggareddy: సీఎం కేసీఆర్ చెప్పింది చేసే చెంచా: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జగ్గారెడ్డి ఫైర్

Jaggareddy fires in minister Srinivas Goud

  • శ్రీనివాస్ గౌడ్ ఓ బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు
  • వెట్టిచాకిరీ చేసే మనిషి అంటూ విమర్శలు
  • బచ్చాలకు కాంగ్రెస్ గురించి ఏంతెలుసన్న జగ్గారెడ్డి

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెట్టిచాకిరీ చేసే మనిషి అని, సీఎం కేసీఆర్ చెప్పింది చేయడానికి ఉన్న చెంచా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాదు, ఓ బ్రోకర్ అని ఆరోపించారు.

ఉద్యోగులకు ఏంచేశారని  సీఎం కేసీఆర్ కు శ్రీనివాస్ గౌడ్, మమత అనే ఉద్యోగిని స్వీట్లు తినిపిస్తారంటూ మండిపడ్డారు. మమత భర్త రిటైర్ అయినా ఎలా పొడిగించారంటూ ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు శ్రీనివాస్ గౌడ్ చరిత్ర బయటపెడతానంటూ హెచ్చరించారు. మంత్రులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని, కాంగ్రెస్ ను విమర్శిస్తే సహించేది లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బచ్చాగాళ్లకు కాంగ్రెస్ పార్టీ గురించి ఏంతెలుసని అన్నారు.

Jaggareddy
V Srinivas Goud
Congress
KCR
Telangana
  • Loading...

More Telugu News