Jagan: రానున్న రోజుల్లో కరోనా సోకని వ్యక్తి ఉండకపోవచ్చు: జగన్ సంచలన వ్యాఖ్యలు

Every one is going to affect with Corona says Jagan

  • అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
  • జాగ్రత్తలు తీసుకుంటే 85 శాతం ఇంటివద్దే కోలుకోవచ్చు
  • ఎవరి రాకపోకలనూ మనం కట్టడి చేయలేము

ఏపీలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ప్రతి రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 38,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 492 మంది మరణించారు. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రానున్న రోజుల్లో కరోనా సోకని వ్యక్తి ఉండకపోవచ్చని జగన్ అన్నారు. కరోనా సోకినా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే 85 శాతం ఇంటివద్దే కోలుకోవచ్చని చెప్పారు. పొరుగున ఉన్న రాష్ట్రాలు సరిహద్దులను తెరిచి ఉంచాయని, ఎవరి రాకపోకలనూ మనం కట్టడి చేయలేమని... ఈ నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టిని సారించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News