Google: గూగుల్ ను ఆకర్షించిన 'డిజిటల్ ఇండియా'... భారత్ లో రూ.75 వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించిన సుందర్ పిచాయ్

Google announce huge investment in India

  • ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ చర్చలు
  • డిజిటల్ ఇండియాపై ఆసక్తి
  • తమ పెట్టుబడులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయన్న పిచాయ్

భారత్ లో గూగుల్ భారీ పెట్టుబడులు ప్రకటించింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భారత ప్రభుత్వం ప్రకటించిన 'డిజిటల్ ఇండియా'ను సాకారం చేసేందుకు రూ.75 వేల కోట్ల మేర వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించారు.

భారత్ లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడానికి తమ నిధులు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ అభిలషిస్తున్న డిజిటల్ ఇండియాకు మద్దతుగా నిలుస్తున్నందుకు గర్విస్తున్నామని ట్విట్టర్ లో తెలిపారు. ఈ క్రమంలో భారత కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, రమేశ్ పోఖ్రియాల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News