Rewa Solar Plant: 750 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

PM Modi dedicates Rewa Solar Plant to nation

  • ప్రత్యామ్నాయ విద్యుత్ గా సౌరశక్తి
  • ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థకు రేవా ప్రాజెక్టు నుంచి విద్యుత్
  • నిర్మాణం జరుపుకుంటున్న మరికొన్ని ప్రాజెక్టులు

జల, థర్మల్ విద్యుత్ కు ప్రత్యామ్నాయంగా ప్రపంచం దృష్టి సౌరశక్తిపై పడింది. భారత్ లోనూ సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ఊపందుకుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని రేవాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, రేవాలోనీ ఈ సోలార్ ప్లాంట్ ఇక్కడి పరిశ్రమలకు విద్యుత్ అందించడమే కాకుండా, ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. రేవా మాత్రమే కాకుండా, షాజాపూర్, నీముచ్, ఛత్తర్ పూర్ లోనూ సౌరవిద్యుత్ కేంద్రాలు నిర్మాణం జరుపుకుంటున్నాయని వివరించారు.

Rewa Solar Plant
Narendra Modi
Nation
Delhi Metro
India
  • Loading...

More Telugu News