: టాస్ గెలిచి తోలు వలిచారు!


ఐపీఎల్-6 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోనీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్ మైకేల్ హసీ (58 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), వన్ డౌన్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా (42 బంతుల్లో 82 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సులు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా పిచ్ పై ముంబయి బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో, ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టపోయి 192 పరుగులు సాధించింది.

  • Loading...

More Telugu News