MS Dhoni: ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో

CSK CEO comments on Dhoni

  • ఇవాళ ధోనీ పుట్టినరోజు
  • శుభాకాంక్షలు తెలిపిన సూపర్ కింగ్స్ సీఈఓ
  • పదేళ్లలో ధోనీ సూపర్ కింగ్స్ ఓనర్ అవుతాడంటూ జోస్యం

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా, చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాథన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లలో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి అధినేత అవుతాడని జోస్యం చెప్పారు. ధోనీ ఒక అత్యుత్తమ ఆటగాడని, ఎప్పటికీ అతని స్థాయి అదేనని పేర్కొన్నారు. ఇతరుల్లో స్ఫూర్తిని నింపడంలో ధోనీ తర్వాతే ఎవరైనా అని తెలిపారు. అందుకే తాము ధోనీని 'తలా' (నాయకుడు) అని పిలుచుకుంటామని విశ్వనాథన్ వెల్లడించారు.

"ఓసారి వరుస పరాజయాలు చెన్నై జట్టును కుదిపేశాయి. ఆ సమయంలో ధోనీ ప్రతి ఆటగాడి వద్దకు వెళ్లి వారిని కార్యోన్ముఖుల్ని చేశాడు. మనపై మనం నమ్మకం కలిగి ఉండాలని వారి నూరిపోశాడు. 'నా జీవితంలో ఎన్నోసార్లు ఇది పాటించాను... విజయం సాధించాను' అంటూ వారిలో కొత్త ఉత్సాహం కలిగించాడు. ధోనీని 'తలా' అని పిలిచేది ఈ లక్షణం వల్లే" అని విశ్వనాథన్ వివరించారు.

MS Dhoni
CSK
Viswanathan
Owner
  • Loading...

More Telugu News