: ప్రేమజంటలకు నేడు పెళ్లిళ్ళు చేసేస్తాం: వీహెచ్పీ, భజరంగదళ్
ప్రేమికుల దినోత్సవం అంటూ తిరిగే జంటలకు ఈ రోజు ఎక్కడికక్కడ పెళ్ళిళ్ళు చేసేస్తామని విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ సంస్థలు ప్రేమజంటలను హెచ్చరించాయి. మన భారతీయ సంస్కృతికి విరుద్ధంగా పార్కులు, పబ్బులు, హోటళ్ళలో వేలంటైన్స్ డే జరుపుకునే జంటలను వెంటాడి మరీ పట్టుకుంటామని ఈ సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి. బహుళజాతి సంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కై, పాశ్చాత్య సంస్కృతికి చెందిన వేలంటైన్స్ డేను ప్రోత్సహిస్తోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి యమన్ సింగ్, భజరంగదళ్ నగర కన్వీనర్ భరత్ వంశీ విమర్శించారు. నిన్న హైదరాబాదులో వీరు మీడియాతో మాట్లాడారు.