Tapsee: కంగన రనౌత్ కామెంట్ పై తాప్సీ స్పందన

Taapsee response on Kangana Ranaut comments

  • కంగన, తాప్పీల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం
  • కొందరు మంచిలో కూడా చెడును చూస్తారన్న తాప్సీ
  • అలాంటి వారి గురించి ప్రార్థనలు చేద్దామని వ్యాఖ్య

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో వేళ్లూనుకున్న నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్, తాప్సీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల తాప్సీ చేసిన వ్యాఖ్యలపై కంగన డిజిటల్ టీమ్ స్పందిస్తూ... సినీ నేపథ్యం లేకుండా వచ్చినవారు కూడా మూవీ మాఫియా దృష్టిలో మంచిగా ఉండాలనుకుంటున్నారని వ్యాఖ్యానించింది. తాప్సీ నిన్ను చూసి సిగ్గుపడుతున్నామని పోస్ట్ చేసింది.

ఈ వ్యాఖ్యలపై తాప్సీ స్పందిస్తూ... కొందరు వ్యక్తులు మంచిలో కూడా చెడును చూస్తారని వ్యాఖ్యానించింది. అలాంటి వారి పట్ల కూడా మనం మంచిగానే ఉండాలని... వారి గురించి ప్రార్థనలు చేద్దామని చెప్పింది. మన ప్రవర్తన ఎలా ఉండకూడదో వారిని చూసి తెలుసుకోవాలని తెలిపింది.

Tapsee
Kangana
Bollywood
Tollywood
  • Loading...

More Telugu News