: మంత్రులకో న్యాయం, జగనన్నకో న్యాయమా?: షర్మిల
ఆరోపణలు ఎదుర్కొంటున్నంత మాత్రాన కళంకితులం కాదని రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డిలు వ్యాఖ్యానించడంపై వైఎస్సార్సీపీ నేత షర్మిల స్పందించారు. మంత్రులపై ఆరోపణలు రుజువు కానందున వారు తాము నిర్దోషులమని చెప్పుకొంటున్నారని.. జగన్ ను ఏ కోర్టూ దోషి అని తేల్చలేదని, అయినా, ఆయనపై అవినీతిపరుడని ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోలు జారీ చేసే విషయంలో బాధ్యత క్యాబినెట్ మొత్తానిది అని చెబుతున్నారని, ఆ జీవోలు సక్రమమని ఆనాడే స్పష్టం చేసి ఉంటే జగన్ జైలుకు వెళ్ళేవాడు కాదని షర్మిల అభిప్రాయపడ్డారు.