Konakalla Narayana: విచారణ కూడా జరపకుండా అరెస్ట్ చేయడం దారుణం: కొనకళ్ల

Kollu Ravindras arrest is not fair

  • రాజకీయ కక్షతోనే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయించారు
  • వివాదాల జోలికి ఆయన వెళ్లరు
  • రాష్ట్ర ప్రభుత్వం బీసీలను టార్గెట్ చేసింది

మంత్రి పేర్ని నాని అనుచరుడు భాస్కరరావు హత్య కేసులో టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా  కలకలం రేపుతోంది. దీనిపై టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, రాజకీయ కక్షతోనే రవీంద్రను అరెస్ట్ చేశారని అన్నారు. కనీస విచారణ కూడా జరపకుండా అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు.

నిందితులు చెప్పారని, దాన్ని ప్రామాణికంగా తీసుకుని అదుపులోకి తీసుకోవడం సరికాదని చెప్పారు. వివాదాల జోలికి రవీంద్ర వెళ్లరని అన్నారు. సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించాలనే ధోరణి ఆయనదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక అని... వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే తప్పుడు కేసులను బనాయిస్తున్నారని చెప్పారు. బీసీలను టార్గెట్ చేసి, వరుసగా కేసులు పెడుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News