Serila Actor Ravikrishna: సీరియల్ నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్

Serial actor Ravikrishna tests corona positive
  • తనకు కరోనా సోకిందని ప్రకటించిన రవికృష్ణ
  • ఐసొలేషన్ లో ఉన్న సీరియల్ నటుడు
  • తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని విన్నపం
టీవీ సీరియల్ నటుడు రవికృష్ణకు కరోనా వైరస్ సోకింది. టెస్టులో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలియజేశాడు. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని చెప్పాడు. అయితే ఎలాంటి లక్షణాలు మాత్రం లేవని తెలిపాడు. ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నానని తెలిపాడు. కరోనా తనకు ఎక్కడ సోకిందనే విషయం గురించి తాను ఆందోళన చెందడం లేదని చెప్పాడు. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా ఐసొలేషన్ కు వెళ్లాలని, టెస్టు చేయించుకోవాలని విన్నవిస్తున్నానని తెలిపాడు.
Serila Actor Ravikrishna
Corona Virus

More Telugu News