DSP: హైదరాబాదులో కొన్నిరోజుల వ్యవధిలోనే ఇద్దరు డీఎస్పీలు గుండెపోటుతో మృతి

Another DSP dies of heart attack in Hyderabad
  • ఇటీవలే ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ మరణం
  • తాజాగా ఎక్సైజ్ డీఎస్పీ రాజేంద్ర కులకర్ణి మృతి
  • రాజేంద్ర 1995 బ్యాచ్ అధికారి
హైదరాబాదులో ఇద్దరు డీఎస్పీలు కొన్ని రోజుల వ్యవధిలోనే కన్నుమూయడం అధికార వర్గాల్లో విషాదం కలిగించింది. ఇటీవలే ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆ ఘటన మరువక ముందే ఎక్సైజ్ డీఎస్పీ రాజేంద్ర కులకర్ణి కూడా హార్ట్ అటాక్ తో మృతి చెందారు. రాజేంద్ర కులకర్ణి 1995 బ్యాచ్ కు చెందిన అధికారి. ఆయన ఉప్పల్ లో నివాసం ఉంటున్నారు. ఇంతకుముందు చనిపోయిన డీఎస్పీ ప్రతాప్ కూడా అదే బ్యాచ్ కు చెందినవారు. ఇప్పటికే కరోనా భయం ముసురుకుంటున్న తరుణంలో హైదరాబాదులో పోలీసు ఉన్నతాధికారుల హఠాన్మరణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
DSP
Hyderabad
Death
Heart Attack
Police

More Telugu News