Telangana: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో కరోనా కలకలం.. 18 మందికి పాజిటివ్

TS Inter Board employees tested corona positive
  • తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా
  • ఇంటర్ బోర్డులో మహమ్మారి కలకలం
  • ఆందోళనలో బోర్డు ఉద్యోగులు
తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరు ఆందోళనను కలిగిస్తోంది. ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాదులోని ఇంటర్మీడియట్ బోర్డులో పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి వైరస్ సోకింది. దీంతో ఇతర ఉద్యోగులకు కూడా టెస్టులు చేయించగా... మొత్తం 18 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మరి కొందరు ఉద్యోగుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. దీంతో, మరెంత మందికి వైరస్ సోకిందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు కార్యాలయాన్ని అధికారులు శానిటైజ్ చేయిస్తున్నారు.
Telangana
Intermediate Board
Corona Virus

More Telugu News