Warangal Rural District: 'నా చావుకు కారణం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డే' అంటూ గొంతుకోసుకున్న వ్యక్తి

Man suicide in Hanamkonda

  • ఓడీసీఎంఎస్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న నెక్కొండ మండల వాసి
  • లాక్‌డౌన్ కారణంగా విధుల నుంచి తొలగించిన వైనం
  • ఎమ్మెల్యేను కలిసి తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్న వైనం

తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డే కారణమంటూ హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం.. నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రామరాజు నర్సంపేటలోని ఓడీసీఎంఎస్‌ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఇటీవల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పక్కనపెట్టారు. ఇటీవల ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి నెక్కొండకు రాగా, ఆయనను కలిసిన రామరాజు తండ్రి వెంకటేశ్వరులు తన కుమారుడికి తిరిగి ఉద్యోగం ఇప్పించాలని కోరాడు.

నిన్న కూడా ఎమ్మెల్యేను తన నివాసంలో కలిసి ఇదే విషయమై అభ్యర్థించాడు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని చాకుతో గొంతు కోసుకున్నాడు. ఈ సందర్భంగా తన చావుకు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డే కారణమని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని కేసీఆర్‌ను అభ్యర్థిస్తూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఎమ్మెల్యే పెద్ది.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తానని పేర్కొన్నారు.

Warangal Rural District
hanamkonda
outsourcing
Suicide
  • Loading...

More Telugu News