Venkatesh: వెంకటేశ్ తో శేఖర్‌ కమ్ముల ప్రాజక్టు!

Shekhar Kammula to direct Venkatesh

  • కొత్తదనాన్నిఆవిష్కరించే శేఖర్ కమ్ముల 
  • ప్రస్తుతం చైతూ, సాయిపల్లవితో 'లవ్ స్టోరీ'
  • శేఖర్ కమ్ముల కథకు వెంకీ గ్రీన్ సిగ్నల్  

దర్శకుడు శేఖర్ కమ్ములది ప్రత్యేకమైన శైలి. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా.. వంటి చిత్రాల ద్వారా తెలుగుతెరపై కొత్తదనాన్ని ఆవిష్కరించాడు. ప్రేమానుబంధాలను సున్నితంగా స్పృశించే కథలతో.. హృద్యమైన గీతాలతో ఆయన సినిమాలు ఆహ్లాదకరంగా సాగుతాయి. అలాంటి శేఖర్ త్వరలో ప్రముఖ నటుడు వెంకటేశ్ తో ఓ చిత్రాన్ని చేయనున్నట్టు సమాచారం.

ఈ ప్రాజక్టు విషయమై ఇటీవల వెంకటేశ్, శేఖర్ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. శేఖర్ చెప్పిన కథకు వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం నాగ చైతన్య, సాయిపల్లవితో శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' చిత్రాన్ని చేస్తున్నారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ 'నారప్ప' చిత్రాన్ని చేస్తున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే సినిమా సెట్స్ కి వెళుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది.    

Venkatesh
Shekhar Kammula
Chaitanya
Saipallavi
  • Loading...

More Telugu News