Abhisheik Bachchan: కుమార్తె ఆరాధ్య కారణంగా కొన్ని సినిమా అవకాశాలను కోల్పోయిన అభిషేక్ బచ్చన్!

Abhisheik Loss Some Movies Because of Aradhya

  • శృంగార సన్నివేశాలను ఇష్టపడని ఆరాధ్య
  • అటువంటి సీన్లున్న సినిమాలను వదులుకున్నా
  • ఓ చాట్ షోలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన అభిషేక్

తన గారాలపట్టి ఆరాధ్య కారణంగా కొన్ని సినిమా అవకాశాలను తాను కోల్పోయానని అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యానించారు. తాజాగా, ఓ చాట్ షోలో పాల్గొన్న అభిషేక్, తానెంతో ప్రేమగా చూసుకునే ఆరాధ్యకు నచ్చని విషయాలను తాను చేయబోనని అన్నారు. తాను రొమాన్స్ సన్నివేశాలు చేయడం ఆరాధ్యకు ఇష్టం లేదని, ఆమెకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు తాను చాలా సినిమాలను వదిలేసుకున్నానని ఆయన చెప్పారు. తనను అటువంటి సీన్లలో చూసేందుకు ఆరాధ్య ఇష్టపడటం లేదని చెప్పారు.

అటువంటి సీన్లలో నన్ను చూసిన తరువాత ఆరాధ్య అడిగే ప్రశ్నలకు తాను సమాధానాలు ఇవ్వలేకపోయానని, అందుకే ఏదైనా సినిమాకు సంతకం చేసే ముందే, తాను మితిమీరిన శృంగార సన్నివేశాలు చేయబోనని నిర్మాత, దర్శకులకు చెప్పేవాడినని, ఈ కారణంగా కూడా కొన్ని సినిమాల్లో వచ్చిన అవకాశాలు తనకు దూరమయ్యాయని, అయితే, ఈ విషయమేమీ తనను బాధించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆరాధ్య వచ్చిన తరువాత తమ జీవితాలలో ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు.

కాగా, ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ న‌టించిన‌ 'లూడో', 'బాబ్ బిస్వాస్'‌, 'ద బిగ్ బుల్' సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధంగా ఉన్నాయి. లాక్ డౌన్ రాకుంటే వీటిలో రెండు చిత్రాలు ఈ పాటికి విడుదలయ్యేవి కూడా. మ‌రో నాలుగు ప్రాజెక్టులకు అభిషేక్ సైన్ చేశాడు. పరిస్థితులు అనుకూలిస్తే, వీటి షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది.

Abhisheik Bachchan
Aradhya
Movies
  • Loading...

More Telugu News