China: భీకర దాడికి ముందు... సరిహద్దులకు చైనా మార్షల్ ఆర్ట్స్ యోధులు: సంచలన విషయాన్ని వెల్లడించిన చైనా అధికార పత్రిక

China Sends Martial Arts Fighters day before Attack on Indian Army

  • దాడికి ఒక రోజు ముందు పోరాట యోధులు
  • పర్వతారోహకులను కూడా పంపిన చైనా
  • వెల్లడించిన  'చైనా నేషనల్ డిఫెన్స్ న్యూస్'

ఇటీవల భారత సైనికులపై దాడికి కొన్ని రోజుల ముందు చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లను, పర్వతారోహకులను సరిహద్దులకు పంపించింది. ఆ తరువాత వారి ఆధ్వర్యంలోనే దాదాపు 50 ఏళ్ల తరువాత చైనా, భారత సైనికుల మధ్య పోరు జరిగింది. ఈ విషయాన్ని చైనా అధికార సైనిక పత్రిక 'చైనా నేషనల్ డిఫెన్స్ న్యూస్' స్వయంగా వెల్లడించింది. జూన్ 15న లాసా ప్రాంతానికి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఒలింపిక్ ర్యాలీ టీమ్ సభ్యులు, ఓ మార్షల్ ఆర్ట్స్ క్లబ్ సభ్యులు వెళ్లారన్న సంచలన విషయాన్ని న్యూస్ ఏజన్సీ వెల్లడించింది.

ఇదే సమయంలో సీసీటీవీ ఫుటేజ్ వందలాది కొత్త సైనికులు టిబెట్ రాజధాని లాసా నుంచి కదులుతున్న దృశ్యాలను టీవీ చానెళ్లు ప్రత్యేక వార్తలను ప్రసారం చేశాయి. ఇదే విషయాన్ని టిబెట్ కమాండర్ వాంగ్ హైజాంగ్ కూడా స్పష్టం చేశారు. ఈ దళాలు తమ బలాన్ని, వేగంగా ప్రతిస్పందించే చర్యలను పెంచుతాయని అన్నారు. అయితే, ఈ దళాలు భారత సరిహద్దులకు బయలుదేరాయా? అన్న విషయంపై మాత్రం స్పష్టత నివ్వలేదు. 

కాగా, అదే రోజున సరిహద్దుల్లో భారత సైనికులపై చైనా ఆర్మీ దాడి చేసింది. లడఖ్ రీజియన్ కు 1,300 కిలోమీటర్ల దూరంలో ఇరు దేశాల మధ్య భీకర దాడి జరిగింది. ఇదే దాడిలో ఇండియాకు చెందిన 21 మంది వీరులు అమరులయ్యారు. ఇప్పటికీ భారీ సంఖ్యలోనే చైనా సైనికులు ఆ ప్రాంతంలో ఉండటంతో, వారితో సమానంగా భారత్ కూడా అదనపు సైనిక బలగాలను, ఆయుధ సంపత్తిని మోహరిస్తోంది.

  • Loading...

More Telugu News