JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు పీటీ వారంట్లు జారీ

Court issues PT warrant to JC Prabhakar Reddy

  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరు
  • 14 రోజుల రిమాండ్ విధించిన జిల్లా కోర్టు
  • వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీ

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు రెండు కేసుల్లో జిల్లా కోర్టు పీటీ వారంట్లు జారీ చేసింది. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ఇద్దరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు పోలీసులు హాజరుపరిచారు. ఇద్దరికీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. తాజాగా రవికుమార్ అనే ఆర్టీఏ బ్రోకర్ ను తాడిపత్రిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్ల తయారీ, ఇన్వాయిస్ ల తయారీపై పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.

JC Prabhakar Reddy
Telugudesam
PT Warrant
  • Loading...

More Telugu News