Ameerpet: అమీర్ పేట తహసీల్దార్ చంద్రకళకు కరోనా.. సిబ్బందికి పరీక్షలు!

Ameerpet Tahasildar tested corona positive

  • హైదరాబాదులో కరోనా విజృంభణ
  • తహసీల్దార్ కరోనా బారినపడడంతో కార్యాలయం శానిటైజేషన్
  • జీహెచ్ఎంసీ సిబ్బందిలోనూ పెరుగుతున్న కరోనా బాధితులు

హైదరాబాదులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. తాజాగా అమీర్ పేట తహసీల్దార్ చంద్రకళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో తహసీల్దార్ కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. అంతేకాదు, కార్యాలయంలోని సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేశారు. అటు, జీహెచ్ఎంసీ సిబ్బందిలోనూ కరోనా బాధితుల సంఖ్య మరింత పెరుగుతోంది. ప్రధాన కార్యాలయంతో పాటు ప్రాంతీయ, ఉప కార్యాలయాల్లోనూ కరోనా జోరు కనిపిస్తోంది. కింది స్థాయి సిబ్బందికే కాదు, అధికారులకు సైతం కరోనా నిర్ధారణ అవుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

Ameerpet
Tahasildar
Corona Virus
Positive
  • Loading...

More Telugu News