Bigg Boss: బిగ్ బాస్ హోస్టుగా అందాలతార ఒప్పుకునేనా?

Samantha to host Bigg Boss show

  • రియాలిటీ షోలలో బిగ్ బాస్ కి మంచి క్రేజ్ 
  • గత సీజన్లకు హోస్టులుగా ఎన్టీఆర్, నాని, నాగార్జున
  • నాలుగో సీజన్ కి సమంతతో సంప్రదింపులు

తెలుగు టీవీ చానెల్స్ ప్రసారం చేసే రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' షోకి మంచి క్రేజ్ వుంది. అందుకే, ఈ షోకి టీఆర్పీ కూడా అదిరిపోతుంది. దానికి కారణం, అందులో అందరికీ తెలిసిన, పాప్యులారిటీ వున్న సెలబ్రిటీలు పాల్గొనడం ఒకటైతే, దానికి మరెంతో పేరున్న సినిమా స్టార్ హోస్టుగా వ్యవహరించడం మరొకటి.

ఇక తెలుగులో వచ్చిన బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్టుగా చేస్తే, రెండో సీజన్ కి నాని వ్యవహరించాడు. మూడో సీజన్ కి అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. వీరు వారి వారి స్టయిల్ లో హోస్ట్ చేయడంతో షోకి మంచి ఆదరణ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ షోకి నాలుగో సీజన్ వచ్చింది. ఇప్పటికే పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా జరుగుతోంది. ఈ విషయంలో కొందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి.

ఇక దీనికి హోస్ట్ ఎవరన్నదే సస్పెన్స్ గా వుంది. ఈ విషయంలో ప్రస్తుతం కథానాయిక సమంతతో సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు. తనైతే షోకి గ్లామర్ రావడంతో పాటు, షోని సరదాగా, చలాకీగా నిర్వహిస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారట. అయితే, సమంత మాత్రం ఈ ఆఫర్ పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News