Britain: భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిటన్ ప్రధాని తీవ్ర ఆందోళన!
- లడఖ్ వద్ద ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత
- పరిస్థితి సీరియస్ గా ఉందన్న బోరిస్ జాన్సన్
- చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన
లడఖ్ లోని వాస్తవాధీనరేఖ వద్ద ఇండియా-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితి చాలా సీరియన్ గా, ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఈ సమస్యను ఇరు దేశాలు చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇండియా-చైనా మధ్య నెలకొన్న పరిస్థితిని యూకే నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు.
మరోవైపు నిన్న భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, స్టాండ్ ఆఫ్ పాయింట్స్ నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పే దిశగా అడుగులు వేసేందుకు అంగీకారానికి వచ్చామని తెలిపారు.