Jagan: 90 రోజుల్లో ప్రతి కుటుంబానికి పరీక్షలు చేయాలి: ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan reviews corona situations in AP

  • కరోనా పరిస్థితులపై సీఎం సమీక్షా సమావేశం
  • 104 వాహనాల ద్వారా కరోనా పరీక్షలు
  • ఫోన్ ద్వారా సమాచారం అందించినా కరోనా టెస్టులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రత్యేక ఆరోగ్య కార్యదర్శి జవహర్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కరోనా నివారణ చర్యలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కరోనా విషయంలో తమ ప్రభుత్వ విధానాలను కూడా వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా చికిత్స అందిస్తున్న తొలి రాష్ట్రం ఏపీనే అని స్పష్టం చేశారు.

సమీక్షలో సీఎం జగన్ నిర్ణయాలు, ఆదేశాలు ఇవే....

  • 90 రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో అందరికీ అవగాహన కల్పించి పరీక్షలు చేయాలి.
  • 104 వాహనాల ద్వారా ప్రతి కుటుంబం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
  • 104 వాహనాల్లో కరోనా నమూనాలు సేకరించాలి.
  • డయాబెటిస్, బీపీ చెక్ చేసి అక్కడికక్కడే మందులివ్వాలి.
  • అనారోగ్య తీవ్రతను అనుసరించి వారిని పీహెచ్ సీకి రిఫర్ చేయాలి.
  • ప్రతి పీహెచ్ సీలో కరోనా నమూనాల సేకరణ కేంద్రం ఉండాలి.
  • 104 స్టాఫ్ తో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ వలంటీర్లను అనుసంధానం చేయాలి.
  • ప్రతి గ్రామానికి ప్రతి నెలలో ఒకరోజు 104 వాహనం వెళ్లాలి.
  • కరోనా పరీక్షలు కంటైన్మెంట్ జోన్లలో 50 శాతం, మిగిలిన ప్రాంతాల్లో 50 శాతం చేపట్టాలి.
  • ఫోన్ ద్వారా సమాచారం అందించేవారికి కూడా కరోనా పరీక్షలు చేయాలి.
  • ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు ఎస్ఓపీ తెలియజేయడంతో పాటు ఫోన్ నెంబర్ ఇవ్వాలి.

  • Loading...

More Telugu News