Suhasini: చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో సుహాసిని?

Suhasini to play key role in Chiranjivis film
  • చిరంజీవితో మలయాళం హిట్ 'లూసిఫర్' రీమేక్ 
  • ప్రస్తుతం ముమ్మరంగా ప్రీ ప్రొడక్షన్ పనులు
  • మంజూ వారియర్ పాత్రలో సుహాసిని
ఒకప్పుడు చిరంజీవి, సుహాసిని జోడీ అంటే పెద్ద క్రేజ్. అప్పట్లో ఇద్దరూ కలసి పలు చిత్రాలలో నటించారు. ఈ కాంబినేషన్లో పలు హిట్ చిత్రాలు వున్నాయి. అలాంటి చిరంజీవి, సుహాసిని కలసి ఇప్పుడు ఓ సినిమాలో నటించనున్నారు. మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో సుహాసిని నటించనున్నట్టు తాజా సమాచారం.

మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' అక్కడ మంచి విజయాన్ని సాధించింది. దీంతో తన తండ్రితో దీనిని రీమేక్ చేయడానికి హీరో రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నాడు. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మలయాళం ఒరిజినల్ లో మంజూ వారియర్ పోషించిన కీలక పాత్రకు టాలెంటెడ్ నటిని ఎంపిక చేయాలని భావించి, సుహాసినిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్టుకి మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు.    
Suhasini
Chiranjeevi
Mohanlal
Charan

More Telugu News