India: ఉద్రిక్తతల నేపథ్యంలో భార‌త్‌‌, చైనా సైనికాధికారుల కీలక భేటీ

india china army top army officials meets at borders

  • చైనా వైపున ఉన్న వాస్తవాధీన రేఖ లోప‌ల భేటీ
  • చుశూల్‌ సెక్టార్‌లోని మోల్డోలో గతంలోనూ ఇరు దేశాల భేటీ
  • గాల్వన్‌ లోయ తమదేనంటూ చైనా-భారత్ వాదనలు

ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల సైనికాధికారులు మరోసారి సమావేశమయ్యారు. చైనా వైపున ఉన్న వాస్తవాధీన రేఖ లోప‌ల‌ చుశూల్‌ సెక్టార్‌లోని మోల్డో వ‌ద్ద రెండు దేశాల‌కు చెందిన అగ్రశేణి క‌మాండ‌ర్లు ఈ స‌మావేశంలో పాల్గొంటున్నారు.

ఈ నెల 6వ తేదీన కూడా ఇదే ప్రాంతంలో ఇరు దేశాల ఆర్మీ అధికారులు స‌మావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విస్మరించి ఈ నెల 15వ తేదీన చైనా సైనికులు భారత ఆర్మీపై దాడి చేయడంతో 20 మంది భార‌త జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో భారత సైనికులు తిరగబడడంతో చైనా సైనికులు కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గాల్వన్‌ లోయ తమదేనంటూ చైనా-భారత్ పరస్పరం వాదనలు చేసుకుంటోన్న నేపథ్యంలో జరుగుతోన్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News