Corona Virus: తెలంగాణలో కరోనా విజృంభణ... కొత్తగా 352 మందికి పాజిటివ్

Corona virus spreading speedily in Telangana
  • రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027
  • జీహెచ్ఎంసీ పరిధిలో మరో 302 మందికి కరోనా
  • తాజాగా ముగ్గురి మృతి
తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. గడచిన 24 గంటల్లో 352 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలోని కేసుల సంఖ్య 302. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,027కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న మరో 230 మందిని డిశ్చార్జి చేశారు. మొత్తమ్మీద 3,301 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,531 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో ముగ్గురు మరణించడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 195కి పెరిగింది.
.
Corona Virus
Telangana
Positive
Deaths
Discharge

More Telugu News