Colonel Santosh Babu: సంతోష్‌బాబుకు నివాళులర్పించిన ప్రముఖులు

Political leaders paid tribute to Santosh Babu
  • నిన్న రాత్రి 11:40కు సూర్యాపేటకు సంతోష్ బాబు పార్థివదేహం
  • గుత్తా సుఖేందర్, కోమటిరెడ్డి, బండి సంజయ్ తదితరుల నివాళులు
  • మరికాసేపట్లో ప్రారంభం కానున్న అంతిమయాత్ర
లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా దాడిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం నిన్న రాత్రి 11:40 గంటలకు సూర్యాపేటలోని ఆయన నివాసానికి చేరుకుంది. ఈ ఉదయం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్ బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు. మరికాసేపట్లో కేసారంలోని సంతోష్ బాబు కుటుంబ సభ్యుల వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Colonel Santosh Babu
Suryapet District
Last rites

More Telugu News