KTR: ఈ దృశ్యాలు ఏదో పరాయి దేశంలో అనుకునేరు... మన హైదరాబాదే!: కేటీఆర్
![KTR tweets Hyderabad Outer Ring Road pics](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-0fd89b6d1d13.jpg)
- మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
- హైదరాబాద్ అవుటర్ రింగురోడ్డు ఫొటోలతో ట్వీట్
- రింగురోడ్డు పొడవునా హరిత హారం అమలు చేస్తున్నట్టు వెల్లడి
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ఫొటోలు పంచుకున్నారు. ఈ దృశ్యాలను చూసి ఇవి ఏదో పరాయి దేశంలోనివి అనుకోవద్దని, ఇవి మన హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డుకు సంబంధించిన ఫొటోలని వెల్లడించారు. అవుటర్ రింగురోడ్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం హరిత హారం పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. తన ట్వీట్ లో కేటీఆర్... హైదరాబాద్ అవుటర్ రింగురోడ్డుకు సంబంధించిన ఏరియల్ వ్యూ ఫొటోలను పంచుకున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-1a0db18e90f4726ad1c24667b3fdde7e308b5762.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-5274b9ef66c889033871d3b260084ba9e621157d.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-42a90786cb3a6ab1f8c274565da2584d26973850.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-f86dc0b8784ce481fcc2be1aacaae85808ef5d0e.jpeg)