Pawan Kalyan: వేదాద్రి రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan reacts over Vedadri road accident
  • వేదాద్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • 12 మంది మృతి
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్
కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 12కి పెరిగింది. ఈ రోడ్డు ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 12 మంది చనిపోవడం పట్ల దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు. ఘటన స్థలంలోనే ఏడుగురు చనిపోయారంటే ప్రమాద తీవ్రత ఎలాంటిదో అర్థమవుతుందని తెలిపారు.

లారీలు, ఇసుక టిప్పర్లు, ఇతర రవాణా వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో సైతం అమిత వేగంతో వెళుతుండడంపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై రవాణా శాఖ, పోలీసులు స్పందించి మితిమీరిన వేగానికి కళ్లెం వేసి, రహదారి భద్రత నిబంధనలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, పవన్ కల్యాణ్ వేదాద్రి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద బాధితులకు అవసరమైన సహాయం, వైద్యం విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించాలని  సూచించారు.
Pawan Kalyan
Road Accident
Vedadri
Krishna District
Andhra Pradesh
Telangana

More Telugu News