Peddapalli District: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం

Road accident in peddpalli dist three dead

  • లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
  • బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టిన వైనం
  • స్పాట్ లో ఇద్దరు, ఆసుపత్రిలో ఒకరు మృతి 

పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. జూలపల్లి మండలం అబ్బాపూర్‌కు చెందిన చొప్పరి రజనీకాంత్ (22), మిట్ట మధుకర్ (25), అడప సురేశ్ (23)లు భూపాలపల్లి జిల్లా బొమ్మాపూర్ ఇసుక క్వారీలో పనిచేస్తున్నారు. నిన్న వీరు ముగ్గురూ కలిసి ద్విచక్ర వాహనంపై అబ్బాపూర్ బయలుదేరారు.

ఈ క్రమంలో మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై కూచిరాజ్‌పల్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో రజనీకాంత్, మధుకర్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సురేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Peddapalli District
Road Accident
Telangana
  • Loading...

More Telugu News