DIAT: రెడీ అయిన హెర్బల్ కాటన్ మాస్క్ ‘పవిత్రపతి’!
- రూపొందించిన డీఐఏటీ
- యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్గానూ పనిచేసే మాస్క్
- దీని తయారీకి ముందుకొచ్చిన మూడు కంపెనీలు
కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కొనే హెర్బల్ మాస్కును పూణెలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (డీఐఏటీ) రూపొందించింది. దీని తయారీలో వేపనూనె, పసుపు, తులసి, నల్లమిరియాలు, గంధపుచెక్క, కుంకుమపువ్వు వంటి వాటిని వినియోగించారు. మూడు పొరలతో రూపొందించిన ఈ మాస్కుకు ‘పవిత్రపతి’ అని పేరు పెట్టారు. ఈ మాస్క్ యాంటీ బ్యాక్టీరియల్ అని, యాంటీ వైరల్గా, యాంటీ ఫంగల్గానూ ఇది పనిచేస్తుందని డీఐఏటీ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగ ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్ తెలిపారు. ఈ మాస్కు తయారీకి మూడు కంపెనీలు తమను సంప్రదించినట్టు పేర్కొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మాస్కును తయారుచేసినట్టు ఆయన వివరించారు.