Cleric: "మనం నిద్రపోతుంటే కరోనా కూడా నిద్రపోతుంది"... పాక్ మతగురువు పైత్యం ఇది!

Pakistani cleric comments on corona went viral
  • ఎక్కువ సేపు నిద్రపోవాలంటూ ప్రజలకు సూచన
  • వ్యక్తి చనిపోతే కరోనా కూడా చనిపోతుందంటూ వ్యాఖ్యలు
  • వైరల్ గా మారిన వీడియో
పాకిస్థాన్ అధినాయకత్వమే కాదు, అక్కడి రాజకీయనేతల్లోనూ అజ్ఞానం పాళ్లు ఎక్కువేనన్నది అనేక పర్యాయాలు తేటతెల్లమైంది. తాజాగా ఓ మతగురువు తన పైత్యాన్ని బయటపెట్టుకున్నాడు. కరోనా సోకిన రోగులు దాని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఎక్కువ సమయం నిద్రపోవాలని సూచించాడు.

మనం నిద్రపోతే కరోనా వైరస్ కూడా నిద్రపోతుంది అంటూ శాస్త్రవిజ్ఞానానికే సవాల్ విసిరే వ్యాఖ్యలు చేశాడు. "మీరు నిద్రపోయారనుకోండీ... కరోనా వైరస్ కూడా గమ్మున పడుకుంటుంది. మీకు ఎలాంటి హాని చేయదు. ఒకవేళ మనం చనిపోయామనుకోండీ... అది కూడా చనిపోతుంది... అంతే!" అంటూ దిగ్భ్రాంతి కలిగించేలా సూత్రీకరించాడు. ఈ మతగురువు  చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Cleric
Pakistan
Corona Virus
Sleeping
COVID-19

More Telugu News